Sunday, 25 September 2016

velagave

వెలగవే వెలగవే దీపమా..
ఏ నీడ పడినా ఏ గాలి వీచినా
చెదిరిపోవక నీవూ ..
వెలగవే వెలగవే దీ పమా ..
పండువెన్నెల రేయి
నిలువకనే పోయింది..
నిండు పున్నమి జాబిల్లి
మసకేసి పోయింది..
.....
కరెంటు వాడి పుణ్యమా అని కొవ్వొత్తుల వెలుగులో ఎన్ని కబుర్లో.. మనసు నిండా వెన్నెలే .. పున్నమి వెన్నెల ఎక్కడ నిలుస్తుంది చెప్పండి.. ఆ అనందం తనువూ నిండితే జాబిలెక్కడా ... దీపం వత్తికి ఎన్ని చూపులు ఎన్నిమనసులు 
కాపలానో .. గాలికెక్కడ ధైర్యమూ ..
అందరి ఆనందం  తనది  కూడా అనుకోండి ... నీడ కూడా బెదురుతుంది కాదూ
ఒక వయసూ ఒక అనుభూతీ ఒక్కోసారి చివరి వరకు తాజా అంటే కాదనే వారుంటారా ..
అలాంటి రోజులు చాలా మందికి బాల్యానికి యవ్వనానికి మధ్యకాలం లో ఎక్కువగా అనుభవం అనుకుంటా ..

ఆ అనుభవం తోడుంటే తరువాతి కాలంలో నీడలూ .. పెనుగాలులూ  ఈజీగా ఫేస్ చేయగలం కూడా
ఏమో .. ఎంతమంది పునాది నీడలో బలంగా వున్నారో ఒక పెద్ద సందేహం..
అయినా ఒకానొక టైం లో ఒక చిన్న వెలుతురు మనసులో తొంగి చూ డొ చ్ఛు .. మనం మనంగా
నిలబడితే.... ఏమంటారు ...













1 comment:

  1. ఎంతమంది పునాది నీడలో బలంగా వున్నారో ఒక పెద్ద సందేహం..
    అయినా ఒకానొక టైం లో ఒక చిన్న వెలుతురు మనసులో తొంగి చూ డొ చ్ఛు .. మనం మనంగా నిలబడితే.... ఏమంటారు ...nijame andee.. chinnanaati konni gurtulE manani nilabeDataayi..

    ReplyDelete