Wednesday, 21 September 2016

శ్రీమతి లక్ష్మి రాయవరపు .. గలగల నవ్వుల జడి..  పాట నేర్చిన వెన్నెల కిరణం
గుర్తుచేసె లక్ష్మి గారు రచన ఏదైనా విభిన్నంగా తనదైన ముద్ర తో అలరిస్తారు.. 
వారి జై జవాన్ గజల్ సామాన్యులను సైతం ఉత్తేజితులను చేస్తుంది . 
గతకాలపు అతివల జీవితాలను అద్దంలా చూపిన వారి తాజా రచన ఇది.. 
వారి తదుపరి రచనల కోసం చకోరంలా ఎదురుచూడాలి .. (అరుదుగా వ్రాయడం వల్ల ).. 
...... 
కిన్నెరసాని.. శ్రీమతి లక్ష్మి గారు..  
గల గల పారింది ఉయ్యాలో గంభీర గోదారి ఉయ్యాలో
కిల కిలా నవ్వింది ఉయ్యాలో కిన్నేరా సాని ఉయ్యాలో
  .......

ఎంత గంభీరమో..  గోదావరి ప్రౌఢ లా .. నిండు గా
కిలకిలా నవ్వుల కన్నె కిన్నెరసాని ..
....... 
నీకోడలోయమ్మ ఉయ్యాలో నాజూకు కొమ్మ ఉయ్యాలో
చిలకల కలికమ్మ ఉయ్యాలో కులికె కుందనాలు ఉయ్యాలో
పొయ్యొస్త ఒదినమ్మ ఉయ్యాలో పార్వతి దేవీ ఉయ్యాలో
చిన్న పిల్లనమ్మ ఉయ్యాలో చేతుల్ల పెడుతున్న ఉయ్యాలో
  ....

కదిలే  కుందనాల కొమ్మ కొత్త కోడలు ..
తల్లి చాటు చిన్నపిల్లే ...
 
-- - -- - -

 కోడలా కోడలా ఉయ్యాలో కొడుకు పెండ్లామా ఉయ్యాలో
కుండ కడుగావేమె ఉయ్యాలో కూడు వొండవేమె ఉయ్యాలో
అన్నమయ్యె అత్త ఉయ్యాలో ఆకు వొడ్డించిన ఉయ్యాలో
మామగారిని పిలువు ఉయ్యాలో మంచి నీలు తెస్త ఉయ్యాలో
.. . ... . . .

కొత్త తీరిన కోడలు పనికే ..  ఏ ఇంట అయినా .. ..
.. . ... .. . 
చిన్న బొక్కెనతోని ఉయ్యాలో చిల్లుబిందె నింపు ఉయ్యాలో
పదును లేని కత్తి ఉయ్యాలో పనస పండు కొయ్యి ఉయ్యాలో
అయినయీ పనులన్ని ఉయ్యాలో ఆకలయ్యె అత్త ఉయ్యాలో
పతి రాకపొయ్యెనూ ఉయ్యాలో పాపమేడుండో ఉయ్యాలో
.. ..
పనులలో సైతం తనవాని కొరకే మనసు .. పనిభారం మరిచి 
చిన్నారి కిన్నెరా .. 
.. . .. .. 
నా కొడుకు మారాజు ఉయ్యాలో వాని ఊసెందుకె ఉయ్యాలో
ఇప్పుడాకలేంది ఉయ్యాలో ఇల్లలుకుడెన్నడు ఉయ్యాలో
.. .. .. ..

పరాయిదే  కోడలు .. ఏ చోటైనా ..
.. .. . .. 
బంగారు నా కొడక ఉయ్యాలో బాగ్యమేందిర నీది ఉయ్యాలో
ముద్దుగున్నదని ఉయ్యాలో మురిసి చేసిన కొడక ఉయ్యాలో
.. .. .. .

విడదీసి పాలించు సూత్రమే ప్రతి అత్త కు ..
.. .. .. ..
కదిలి రా బిడ్డా ఉయ్యాలో కబురంపినంకా ఉయ్యాలో
పోయిరా పయనమయి ఉయ్యాలో పైలము కొడుకో ఉయ్యాలో
.. .. ..

మాటలలో తేనెలే దాపరి మనుషులకు ..ఎప్పుడూ ..వాదులకు సారూప్యం
.. .. ... 
కంట నీరాగదు ఉయ్యాలో కాలువయి పోతుంది ఉయ్యాలో
కన్నీరై పారుత నుయ్యాలో నేను కిన్నెరసానినుయ్యాలో
.. .. ..

స్త్రీల నదులకూ సారూప్యం ఒకదానిలో.. నోచ్ఛుకున్న మనసైనా..
కన్నైనా కరిగి నీరే అవుతుంది..  .. అదుపు దాటితే తానే
సముద్రమే అవుతుంది......
.. .. ... ... 
నిన్ను విడిచీ బెట్టి ఉయ్యాలో నేనుండలేనూ ఉయ్యాలో
నువ్వు రాయీవైతె ఉయ్యాలో నీ చుట్టు తిరిగేను ఉయ్యాలో
ఆనందమయ్యింది ఉయ్యాలో అలనై పొంగుతుంటె ఉయ్యాలో
రాయైన నిను తాకి ఉయ్యాలో రాగాలె పాడుతా ఉయ్యాలో
.. .. ..

కిన్నెరసాని కథ లో ఆకట్టుకునే అంశం
దంపతుల అన్యోన్యానురాగం ....
.. . .. .. 
నదినైన సుఖమేది ఉయ్యాలో నా మీదె కన్నురో ఉయ్యాలో
పాడు సంద్రము గాడు ఉయ్యాలో పారి రమ్మంటుండు ఉయ్యాలో
.. .. .

నదులన్నీ కలుపుకునే సం ద్రానికి   ఇక్కడ 
 నింద తప్పలేదు 
.. .. .. 
పావనీ గోదారి ఉయ్యాలో పాపనమ్మా నీకు ఉయ్యాలో
కలిసిపోతీనమ్మ ఉయ్యాలో కడుపులో దాచుకో ఉయ్యాలో
గల గలా పారింది ఉయ్యాలో తల్లి గోదావరి ఉయ్యాలో
కిల కిలా నవ్వింది ఉయ్యాలో కిన్నెరా సాని ఉయ్యాలో
.. ..

నవ్వుల కన్నె కిన్నెరసాని విషాదాల మలుపులెన్నో చేరి
గంభీర గోదారిని కలిసిన  వైనం అత్యంత రమణీయంగా మలిచారు లక్ష్మి గారు
వారికి అభినందనలు..


LikeShow more reactions
Comment

No comments:

Post a Comment