పున్నమి
వెన్నెల జల్లులా
Saturday, 4 November 2017
మెల్ల మెల్లగా పల్లె లేచెనే
చల్ల చల్లగా పైరగాలి వీచెనే
తొలిపొద్దు సూరీడు కిరణాలు గుప్పెనే
ఎలదేటి వాగులో తానాలు చేసెనే
గుడిలోన దైవమే
తీరుగా కొలువాయె
కోరేటి వరములే
వరదలా పారించె
పూవుపూవున అందాలు
కొత్తగా కళ్ళిప్పి చూసాయి
తేటిపాటకు రేకురేకున
సిగ్గులే అలవోక ఒలికాయి
జేగంట సన్నాయి పాట
తోటలో పూలకు తేటికి
జత కలిపెనంట
లేదూడ చిందులో
మోదాలే మురిసెనే
తలయూచు కొమ్మలలో
ఉల్లాసమే ఉరికెనే
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)