Monday, 10 October 2016

గజల్సు

అన్ని 

"ఉన్నదీ"..గజల్ మహల్ ..2

మెరుపుబాల బాటపైన మురిపిస్తూ ఉన్నదీ
హోయలతో మనసంతా కరిగిస్తూ ఉన్నదీ

జాబిలి ఎందుకు పగలే ఉదయించెను ఈరోజు
సెగలన్నీ వెన్నెలగా తలపిస్తూ ఉన్నదీ

కన్నులలో కాటుకేమొ ప్రేమలేఖ పంపుతుంది
జడవిసురూ తాచులానె వెరపిస్తూ ఉన్నదీ

పైరువంటి పచ్చవోణి పరువాలకు పరదాయే
సిగ్గులలో మొగ్గవుతూ వలపిస్తూ ఉన్నదీ

బంతిపూల రంగంతా పావడాగ మురిసిందీ
కలలన్నీ కన్నులలో వెలిగిస్తూ ఉన్నదీ

ఉల్లాసపు మానసమే పరువానికి జతకలిసే
సరాగాల సయ్యాటకు గెలుపిస్తూ ఉన్నదీ

అందానికి రాజెవరో పండుగకే వచ్చెనట
సంక్రాంతి సంబరమే పిలుపిస్తూ ఉన్నదీ

...........................................


"చేరనీ".. ముషయిరా గజల్

భాషలో భావమూ ఒదగడం కష్టమే
మనసుతో స్నేహమూ విరగడం కష్టమే

దూరాన జాబిలీ.. కరగనీ యామినీ
ఒంటరిగ కచ్చేరి సాగడం కష్టమే

నయనాన ఆశ్రువై జారనీ వేదనా
మౌనమే కోయిలై పాడడం కష్టమే

పయనాన అడుగులూ .. జతకెన్ని ఆశలో
బాటలో మొలకలూ ఏరడం కష్టమే

పిలుపుగవిమలవాణి గుండెనే చేరనీ
దాగనీ వెన్నెలా నిలపడం కష్టమే

.......................
1,
"నీవిలా" .. గజల్
ఓ గడుసు కోయిలా కూయకే నీవిలా
ఎద లోపలి విరహం రేపకే నీవిలా
వెన్నెల జలపాతాల సవ్వడిగా నీవు
ప్రణయాగ్నుల నా ఎదను కోయకే నీవిలా
ఎదిగే అమ్మాయికి తొలి అడుగులు మధురం
ఆదమరచి తప్పటడుగు వేయకే నీవిలా
నువ్వొకమాట నేనొకమాట ఎందుకులే
సర్దుకుపోదాం రచ్చ చేయకే నీవిలా
కనుకొలకులవలపు కనుచూపునమెరుపు
మౌనపు ప్రేమలేఖ రాయకే నీవిలా

30.4.2015

.....................

2.
"ఉండలేను" .. గజల్
ఒక క్షణమైనా నిన్ను చూడకుండా ఉండలేను
ప్రళయంలోను నీకోసం ఆగకుండా ఉండలేను
నిన్న లేని చిలిపితనమేదొ గిలిగింతలు పెడుతుంది
నా నీడ నీవే ఐనా నిత్యం నిన్ను తలవకుండా ఉండలేను
కలలోనే కొంటె ఊహలు అల్లరి చేస్తాయిలే
ముంచెత్తె గాఢనిద్రను తరమకుండా ఉండలేను
నీవు లేవని స్వేచ్ఛాఝరులనింతునని తలచాను
మధువనే చెలిచేతికి చిక్కకుండా ఉండలేను
ఏడడుగులంటేను సుఖమైనా బాధైనా నాతోనే అన్నావు
కాలుడొచ్చి రమ్మన్నా పునర్జన్మ అడుగకుండా ఉండలేను
7.5.2015

.....................

3.
 "నేస్తం" -గజల్
దివ్యవేణు మధురమేగ స్నేహము పంచిపోకు నేస్తమా
మల్లెలంత చల్లదనమె నీ చెలిమిగా తాకిపోకు నేస్తమా
జీవితమే కాటెస్తే కన్నీరే కరువైతే కలవరమెగ
నాలోనిను చూసుకొమని నీడలాగ చెదరిపోకు నేస్తమా
పిడికెడంత గుండెలోను అణువంత ప్రేమఉంటె చాలునుగా
జగమంతా ఆనందపు కలారవమై ఆగిపోకు నేస్తమా
పెదవిదాట నినామాట మౌనరాగమై పలికెనునీ స్వరములలో
మధుమాసపు శశిమూర్తివై కన్నులలో కరిగిపోకు నేస్తమా
అనుభవాల సాగరములొ మునకలలే వేస్తుందీ నామనసు
నిలువలేని తరంగమువై గలగలలతొ కదిలిపోకు నేస్తమా
నాలొనేను ఉన్నానో లెనొతెలియక గడిచెనులే కాలము
వేకువలో పిలుపునీవై మురిపించీ వీడిపోకు నేస్తమా
ఎడతెగనివెసవిసంధ్య ఉందోలేదొ మరి చీకటి అనిపించును
చినుకువై పలుకరించి మైమరపించి మాయమైపోకు నేస్తమా
ఆశయమొక అందని అగ్నిశిఖ నిలువనీదు ఒకక్షణం
జడవకబెదరకచేరే చివరిమెట్టై జారిపోకు నేస్తమా
స్నేహమనే పడవలోన తీరాన్నె చేరాలని కలగంటున్న
మనసుగెలిచె ఆనందపు తెలినవ్వువై తరిగిపోకు నేస్తమా
తిరిగిరాని కలవల్లరి అందించిన మధురిమ ఈ ప్రభాతమే
దినమంతా వెంటాడే చెలిమినీడై వదిలిపోకు నేస్తమా
మదిమహలులొ విహరించే కవితనాది మనసారా వింటావా
విశ్వవీణా తంత్రివిగా సుస్వరాల పాడిపోకు నేస్తమా

13.6.2015

.........

4. 
"మమతలలో"... గజల్
ముసుగులేని మనసులన్ని మెరిసిపోవు మమతలలో
ప్రేమలోని దైవముగా నిలిచిపోవు మనసులలో
నెలరాజుకు మనసిచ్చుట అలలకెవరు నేర్పారో
పున్నములకు ఉరకలతో ఎగసిపోవు వెన్నెలలో
తేటిపాట మునగాలని వనముకెవరు నేర్పారో
సుమబాలల వలపునంత నింపిపోవు మధువులలో
వెలుగులన్ని దాచాలని కనులకెవరు నేర్పారో
చెలునిచూచి మెరుపుతీగ మించిపోవు చూపులలో
ముంచేసే వానలకే సరసమెవరు నేర్పారో
గిరికన్నెలు తడిసితడిసి మురిసిపోవు సిగ్గులలో

25.6.2015
........................................

5. 
"విరిసిన వెన్నెల".. గజల్
ఏతోటనొ మనవలపుల వెన్నెల్లని విరిసినదీ
ఆతరినే వేణుగాన బృందావని తోచినదీ
గోదావరి సరిగంగా స్నానాలు పిలిచినవీ
ఉరకలేసె రసవాహిని మనమనసుని నిలిచినదీ
నామనసే మురిసినదీ నీకన్నులు పిలిచెననీ
నాతనువే తమిదీరగ నీసరసని కులికినదీ
ఎటుచూసిన నీవేనని మరియేలా చిత్రమనీ
నీమేనితొ పరిమళమే గుసగుసలని కొసరినదీ
యెదవాకిట పిలిచెపిలుపు నీదొకాదొ తెలియరాదు
సంభ్రమాల తడబడుతూ నాఅడుగుని అడిగినదీ
మేనివిరుపు హరివిల్లే నాకోసం దిగివచ్చెను
సిగ్గంతా అరుణంగా నీచెంపని పూసినదీ

4.7.2015
........................

6.
"మనసులలో".. గజల్
మనసులలో మర్మమెంతొ తెలియాలని ఉన్నదిలే
నవ్వులలో ప్రతిక్షణం మెరవాలని ఉన్నదిలే
భేషజాల ముసుగులలో మమతలనే వదులుదురే
బాలలతో ఆటలలో మురవాలని ఉన్నదిలే
సరసాలకు వేళాయెను అలిగెనేమొ నాసఖుడే
చెంతచేరి మురిపాలను కొసరాలని ఉన్నదిలే
అలకలలో అతివలనే మించుతారు మగవారే
నటనలన్ని ముద్దులకని తెలపాలని ఉన్నదిలే
అనునయాల వెనుకనున్న అల్లరేమొ తెలియనిదా
పరవశాల జల్లులలో తడవాలని ఉన్నదిలే
కన్నులలో కరిగిపోదు అనురాగం మనసునిండి
ఈరేయిని పున్నమిగా మార్చాలని ఉన్నదిలే

12.7.2016
.........................
7.

"తెలియదులే"- గజల్
వెలుగునిచ్చు దినకరునికి విరమించుట తెలియదులే
వలపునిచ్చు నెలరాజుకు కోపించుట తెలియదులే
నీపదముల మువ్వలసడి నాకొరకని తెలియునులే
వేచిచూచు తలపులకు నిదురించుట తెలియదులే
వలవేసే నీకన్నుల మర్మములను ఎరుగలేను
మనసులోన వలపువీణ పలికించుట తెలియదులే
నీపలుకుల పదనిసలే ఎలరాగము నాస్వరముకు
నీవులేని శిశిరంలో మౌనించుట తెలియదులే
తడితెలియని స్మృతులలో వేదనంత నిండిపోయె
పలకరించు పులకలతో స్వప్నించుట తెలియదులే
తొలిసంధ్య వెలుగులలో వేదాలే కనిపించును
జీవితాన విమలవాణి వినిపించుట తెలియదులే

19.7.2015
....................
8.
"కడలి"..
పున్నమి సొగసులు కడలిని వెలిగెను అలలా
వెన్నెల కిరణము కడలిని మెరిసెను అలలా
సతతము ఆగని కెరటపు జడిలో అలసెను
తరగని పంతము మదిలో నిలిపెను అలలా
పరుగున వచ్చెడు నదముల కౌగిటను కరిగెను
సరుగుడు గాలుల రాగము వినుచును అలలా
కురిసెడు వరుణుని చినుకుల జల్లుల మురిసెను
ముత్తెపు వరములు జనులకు ఒసగెను అలలా
విరహపు జ్వాలల వేచెడు పడతిగ తోచెను
పిలిచెడు అందమే జలధిని దాగెను అలలా
నిశీధి రాతిరి ఒంటరి తాపసి వేచెను
తూరుపు కిరణము ఆశలు రేపెను అలలా
శంఖము ప్రణవము నాదము కానుక నిచ్చెను
నగముల సమముగ ధీరువై నిలిచెను అలలా
యుగముల వేదము వారిధి పలికెను వినగా
అందని స్నేహము నింగిని చూచెను అలలా
లీలాధారికి శయ్యగ మారెను ధన్యముగ
విమలవాణిగా ఉదయము పిలిచెను అలలా

26.7.2016
............................
9.
"సాధ్యమా".. గజల్
కంటిపాప గీయురేఖ నిరసించుట సాధ్యమా
వేధించే నీతలపుని ఎదిరించుట సాధ్యమా
నీలోపలి వేదనగా నినువీడక నేనున్న
మనసులోని మాటలన్ని తెలుసుకొనుట సాధ్యమా
కనులుకనే కలలన్నిట నీవుతోడు రావుగా
గాయపడిన రేయంతా భరియించుట సాధ్యమా
శిశిరంలో కోయిలమ్మ తననుతానే మరిచినది
మౌనించిన రాగవీణ శృతిచేయుట సాధ్యమా
వేధించే లోకానికి మనసునెప్పి తెలియుటేల
వెంటాడే ములుకులనె సరళించుట సాధ్యమా
విమలవాణి కరిగించును మనసులోని వెతలన్ని
మంచితనమె బ్రతుకంతా వెలిగించుట సాధ్యమా

9.8.2015
...............................
10.
"మానసమే" - గజల్
వియోగాల గాడ్పులలో మోడుబారె మానసమే
చెలిపలుకుల సమీరాల సేదతీరె మానసమే
దాడిచేయు హిమశరముల జఢమాయెను తనువులన్ని
శిశిరంలో కోరికతో శృతిమీరె మానసమే
తరువువీడి నెలరాలే ఆకుకెంత విరహమాయె
వసంతాన ఆశలతో విరులతేరె మానసమే
ఎదురుచూపు బాటలలో మేఘములే ముసిరినవీ
వలపుజల్లు తొలకరిలో మురిసిపారె మానసమే
నిలిచినవీ భువనాలే ఋతువుల పరి భ్రమణములో
భ్రమను వీడి విమలవాణి మెరిసి ఎగిరె మానసమే

24.8.2015
..................
11.

"నివేదనం" - గజల్
నురుగుఅలల పరుగులన్ని సాగరునికి నివేదనం
మెరుపుకన్నె కులుకులన్ని గగనానికి నివేదనం
పూవులలో మధువులన్ని భ్రమరములే కాజేయును
వనతరువుల వలపులన్ని వనమాలికి నివేదనం
గిరిప్రేమకి మేఘమాల అందించును చినుకులేఖ
పుడమితల్లి సొగసులన్ని దినకరునికి నివేదనం
జ్వలించే చూపులనే మసిచేయును వియోగాలు
గుండెలోని మంటలన్ని చెలినవ్వుకి నివేదనం
బ్రతుకువ్యధల వడిసెగలలో దహియించును ఆశయాలు
నిగ్గదీయు నిజములన్ని మానవతకి నివేదనం
వనములోని విహారమే నవఝరులే నింపినదీ
విమలవాణి రవళులన్ని వనరాజుకి నివేదనం

30.8.2015
.......................
12.
"ఉన్నవీ"...
వేయుఅడుగులు పరమపదముకు సాగుతూనే ఉన్నవీ
పలుకుపదములు విశ్వయశస్సు కోరుతూనే ఉన్నవీ
పాపమేదో పుణ్యమేదో తెలియతరమా మనుషులకు
జీవితముతో వెలుగునీడలు ఆడుతూనే ఉన్నవీ
పల్లెలందున అందమెంతో నగరవాసికి తెలియునా
పైరుపైరున జీవఝరులే పారుతూనే ఉన్నవీ
బ్రతుకుబాటను దిద్దుకొనగా పోరుసలుపుట తప్పదుగ
అడుగుఅడుగున ఆశయాలే మరుగుతూనే ఉన్నవీ
గీతసారమె ప్రతీవారికి అనుభవములో తెలియాలి
అంతరాలే కప్పురములా కరుగుతూనే ఉన్నవీ
మంచియన్నది పెంచమంటూ విమలవాణిని వేడరే
ముసుగుమనసుల మాయపలుకులు పెరుగుతూనే ఉన్నవీ

5.9.2015
.................
13.
"లేఖలు".. గజల్
రాలిన రేకుల బాధలు లేఖలు
వేచిన కన్నుల జ్వాలలు లేఖలు
గుచ్చెడు చూపుల అలకల నీడలు
పలకని మాటల జాడలు లేఖలు
పిలిచెడు విరహపు ముడిచిన పెదవులు
చెదిరిన తలపుల మంటలు లేఖలు
మనసున పుటలే తీయని ఊసులు
దాగిన భావపు రాశులు లేఖలు
మధుపము రెక్కలు కన్నుల రెప్పలు
చెదరిన కలయిక పిలుపులు లేఖలు
విమలవాణిగా కదిలెను పదములు
మధురపు రాతల శరములు లేఖలు

15.9.2015
......................
14.
"కావాలీ".. గజల్
శశిమూర్తినె రగిలించే శరమొకటి కావాలీ
జీవనాన సేదతీర్చే బాల్యమొకటి కావాలీ
మౌనించిన మనసుకేల తుషారాల పలకరింపు
తిమిరాలను తరిమివేయు జాబిలొకటి కావాలీ
శిశిరంలో అంతులేని విరహమెంత కాల్చునో
కాలమునే హరియించే కౌగిలొకటి కావాలీ
ఒకరినొకరు కాటేసే మోసాలే మానాలీ
కనులుమూసి నిద్దరోయె నమ్మికొకటి కావాలీ
ఉరకలేసె పరువానికె హద్దులేవొ తెలియదులే
బంధమేయ వయసునకే గాలమొకటి కావాలీ
వీడలేని వానలలో తడిసిమురిసె వనములన్ని
గులాబులకె ఇనకిరణపు చుంబనొకటి కావాలీ
బ్రతుకంటే మనసుతడిమె అనుభూతుల వెన్నెలవడి
ఎదలయలతొ విమలవాణి గానమొకటి కావాలీ

20.9.2015
.........................
15.

"మధురోహ".. గజల్
మనిషితనపు మధురోహలొ జీవించుట తెలియాలీ
తిరిగిరాని జీవితమును ప్రణయించుట తెలియాలీ
పయనానికి దారిచూపు అడుగుజాడ వెదుకుటేల
దరిచేర్చే చుక్కానిగ తానిలుచుట తెలియాలీ
కనురెప్పలు కాపుండిన ఆదమరుపు తగనిదిలే
కబళించే తిమిరాలను ఎదిరించుట తెలియాలీ
పూలవంటి బాలలంటు ముద్దులొకటె సరికాదులె
కన్నులలో దాచుకునీ పెంచుకొనుట తెలియాలీ
తరువుకింద వడసెగలను ఎదిరించుట చాలదులే
మొలకలెత్తు చిగురులనే ప్రేమించుట తెలియాలీ
దహియించే బడబానల బ్రతుకేమో కొందరిదీ
మరిపించుతు స్నేహపుజడి కురిపించుట తెలియాలీ
కంటజారె చుక్కలలో కధలెన్నీ దాగున్నవొ
మదిమౌనం తెలుపువ్యధ చదువుకొనుట తెలియాలీ
రాహువంటి దానవులే లోకమంత మింగరాదు
మంచితనపు వెన్నెలలా వెలుగొందుట తెలియాలీ
పరుగులెత్తు జీవనాన మమతలెన్నొ గుండెలొనే
కరకుమాట చాటు తీపి గ్రహియించుట తెలియాలీ

2.10.2015
...................
16.
"సొంతమేలే " -
వలపునదముల కులుకునడకలు సాగరానికి సొంతమేలే 
పిల్లగాలుల వూసులన్నీ విరిబాలలకు సొంతమేలే
నిశీధివేళ మనసువాకిట పిలుపునిచ్చెను వలపుతారలు
కరుగువిరహపు ప్రియభావనలు ప్రతీరేయికి సొంతమేలే
కలహపువేళ చూపుతూపుల బాణములేల జాణతనమా
సిగ్గుబిడియము చెలునికౌగిలి చేరుగడియకి సొంతమేలే
స్వేదపుకొంగు చెలియవిడిచిన అల్లరిగాలి చుట్టుముట్టెను
పగలురేయీ లేనిమధురము తీయనికలకు సొంతమేలే
తేనెలూరే అల్లరిమోవి తొందరించుట ఆగదేలనొ
తమకములనూ రేపువలపే యవ్వనానికి సొంతమేలే

8.10.2015
.................
17.
"చూడూ".. గజల్
కన్నుల నదిలో ఆశల కలువలు విరిసెను చూడూ
మదినే తాకిన గాయమె చెలిగా నిలిచెను చూడూ
హిమమై కరిగెను కాలమె జాబిలి నీవై నిలిచిన
వేచిన క్షణముల నీడలు నిశిలో కలిసెను చూడూ
పిలిచెడు తారల చెలిమిని వీడీ రాడే జాబిలి
కలువల కన్నుల తీరని విరహము ముదిరెను చూడూ
మదిలో చేరీ గుసగుసలాడుచు అల్లరి చేసెను
కరిగే రేయిని బిగువగు కౌగిలి నిలిపెను చూడూ
పెదవుల దాగీ నవ్వుల వెలుగులు దోచెను తానే
సరసపు వెన్నెల కాలుచు తనువే మరిచెను చూడూ
భానుని తేజము మేనుల నిండగ మరిగెను రుధిరము
వెన్నెల సాక్షిగ వలపుల జగడము రేగెను చూడూ
కరుణే లేనిది పదునగు మదనుని బాణము తాకగ
తమకము నిలువక కౌగిట చేరీ సోలెను చూడూ
తరిగిన రవికే తోడుగ నిండెను దివ్వెల కాంతి
వెన్నెల ధీటుగ పాపల కన్నులు వెలిగెను చూడూ

15.11.2015
.............................
18.
"కోరుతుంది".. గజల్
వేదనంత చిరునవ్వులో మరపిమ్మని కోరుతుంది
విషాదాల లోగిలింక సెలవిమ్మని కోరుతుంది
వేచివేచి ఆకాశమె అలకలలో మునిగినదీ
జాబిలినే నీవెవరో గురుతిమ్మని కోరుతుంది
నిదురివ్వని గడియలతో చెలిమాయే రేయంతా
కన్నులలో అరుణముగా చోటిమ్మని కోరుతుంది
గతితప్పని రవికిరణం తూరుపునే ఉదయించును
భ్రమణానికి కాలాన్ని తోడిమ్మని కోరుతుంది
అందమైన సందెవేళ జతకోసం వేచినదీ
గుండెనిండ జ్ఞాపకాల మధువిమ్మని కోరుతుంది
అచ్చమైన తెలుపులోనె రంగులన్ని ఒదిగున్నవి
విమలవాణి ముత్యమంటి మనసిమ్మని కోరుతుంది

27.11.2015
.....................
19.
’మధురం’.. గజల్
బాధలో మధురమై మనసునే కోసావె
దీపాన అందమై చూపునే లాగావె
వాంఛలే రేపుతూ చూపులే విసిరావె
తనువులో ఊపిరై ప్రణయాన ముంచావె
సిగ్గులే భారమై రెప్పలే కందెనే
మౌనమే బాణమై దూరమే నిలిపావె
చూపులే పూవులై పాదమే చేరెనే
వేణువై పెదవితో చెలిమినే చేసావె
కాలమే మేరువై నిలిచెనే చేరగా
చెంపపై తోడుగా ప్రేమనే నింపావె
వెన్నెలై తాకుతూ చింతనే తీర్చవే
దూరమై నింగిలో చుక్కలా నిలిచావె
కంటిలో నీరుగా వీడకే ఎప్పుడూ
కవితలా వెల్లువై బ్రతుకునే ముంచావె
కాలమే మేరువై నిలిచెనే చేరగా
కన్నులా నీలమే నింగివై పోయావె
రేపులో నిన్నగా కలలన్ని కరిగెనే
చేతిలో నాకమై ఆశనే చూపావె
నిప్పులే నిత్యమై సాగెలే పదములూ
గమ్యమే చేరగా మమతలే మరిచావె
వేదనే నింపుతూ ఆశలే పెరిగెనూ
మోహమే తుంచుతూ మనిషిగా నిలిచావె

9.12.2015
.................................
20.
"తెలుసులే"... గజల్
వసంతాల వెల్లువెంతొ నిరీక్షణకి తెలుసులే
ఎడారిలో చల్లదనం కంటితడికి తెలుసులే
నీవిచ్చిన ఙ్ఞాపకమే మనసులోని జాబిలీ
దిగులుమబ్బు తరిమేయుట హృదయానికి తెలుసులే
అలకలతో చిరునవ్వే కరువైనా నటనేలె
పదనిసలకు తోడెవరో కలకంఠికి తెలుసులే
కలహంసల తీరేమో నయగారపు విరుపేమొ
కసిపెంచె నడకలన్ని నెరజాణకి తెలుసులే
సిగలోనీ పూవుల్లా సిగ్గెరుగని నవ్వులా
వలరాగపు తేనియలెవొ మధుపానికి తెలుసులే
ఎగసిఎగసి ఒకకెరటం తీరాన్ని చేరినది
అడుగులలో సమిధలెన్నొ పయనానికి తెలుసులే
శిధిలాలలొ జ్ఞాపకాల వెదుకులాట ఎందుకులె
విషాదాల గాయమెంతొ కాలానికి తెలుసులే
మనసన్నది వరమేలే గమనిస్తే ఖైదుయెలె
విమలవాణి విలువెంతో నయనానికి తెలుసులే

13.12.2015
...............................

21.
"ఉన్నదీ".. గజల్
నాకంటిలొ తెలికిరణం నీ చూపులాగ ఉన్నదీ
వంటరికీ వేదనంత చెలియలాగ ఉన్నదీ
ఆనందం కులాసాగ నవ్వుతుంది మెరుపల్లె
నీచూపుల చురకత్తికి పదునులాగ ఉన్నదీ
రాతిరంత వేచివున్న కలువల్లా నీకనులు
జల్లుతున్న మత్తుయేమొ వలపులాగ ఉన్నదీ
తడియారని సంతకమై ననువీడదు నీస్పర్శ
కాలమంత వసంతాన ఖైదిలాగ ఉన్నదీ
కొనగోటను మీటుతుంది మనసులోని కన్నీరు
చెంతనున్న విమలవాణి చెలిమిలాగ ఉన్నదీ

24.12.2015
.....................
22.
"ఓచెలియా".. గజల్
స్వప్నమేదొ పిలిచినదే ఇపుడేనను ఓచెలియా
ఎరుగరాని సుఖములేవొ చూపిపోయె ఓచెలియా
మధురమైన కౌగిలేదొ వదలలేక వగచినదే
లేవెలుగుల తెరలేవో తొలగినవే ఓచెలియా
తెలియరాని గంధమేదొ వీడలేక లీనమాయె
పదమెరుగని గానమేదొ పరిమళించె ఓచెలియా
కనిపించని వయసేమో మధువులనే ఒంపినదే
వెన్నెలొలికె రేయియేదొ తాకినదే ఓచెలియా
మనసంతా వసంతమై విరులెన్నో అందించెనె
తనువంతా కోకిలగా పాడవచ్చె ఓచెలియా
వీడలేని నాకమేదొ పిలుస్తూనె ఉన్నదిలే
కన్నులలో చెదరకనే నిలిచిపోయె ఓచెలియా

29.12.2015
............................
23.
"తెలివెలుగు".. గజల్
నాలోపల నాఉనికీ ప్రశ్నగానె మారుతుంది
అద్దములో నీరూపం కొత్తగానె మారుతుంది
నవ్వులలో తారలన్ని పొందాలని కోరికుంది
చెంతచేర అలకలతో నింగిగానె మారుతుంది
కురిసికురిసి వెన్నెలంత మనసులోనె కొలువాయే
నీరూపుని తడపాలని జల్లుగానె మారుతుంది
చెప్పలేని వూసులన్ని దాగలేక వురుకుతాయి
తనువులోని సిగ్గంతా చూపుగానె మారుతుంది
తొలిజామున స్వామిరూపు తెలివెలుగై పిలిచినదీ
శిశిరమంత చలిమంటల చెలియగానె మారుతుంది
హరివిల్లే భువినిచేరి పూవులుగా మురిసినదీ
మంచుతెరల విరులవనమె పాటగానె మారుతోంది

31.12.2015
..................................
24,
"ఎందుకనో" .. గజల్
విరహమంత గతమౌతూ మారలేదు ఎందుకనో
చూపులన్ని వెలుగులౌతు పిలవలేదు ఎందుకనో
నిశికాంత కౌగిలిలో రేయంతా దాగెనేమొ
దినకరునికి చలివెరపే వదలలేదు ఎందుకనో
మంచుతెరల ముసుగులలో దాగున్నవి సుమబాలలు
కిరణాలకి ముద్దింకా ఇవ్వలేదు ఎందుకనో
వంటరిగా ముళ్ళన్నీ ఏరుకుంటు ఉన్నానులె
వసంతాన వలపుపూల జాడలేదు ఎందుకనో
కంటిచూపు వెన్నెలకై వెదుకులాట తీరలేదు
మరుమల్లెల మధువులలో మత్తులేదు ఎందుకనో

3.1.2016
..........................
25.
"చేరనీ".. ముషయిరా గజల్
భాషలో భావమూ ఒదగడం కష్టమే
మనసుతో స్నేహమూ విరగడం కష్టమే
దూరాన జాబిలీ.. కరగనీ యామినీ
ఒంటరిగ కచ్చేరి సాగడం కష్టమే
నయనాన ఆశ్రువై జారనీ వేదనా
మౌనమే కోయిలై పాడడం కష్టమే
పయనాన అడుగులూ .. జతకెన్ని ఆశలో
బాటలో మొలకలూ ఏరడం కష్టమే
పిలుపుగవిమలవాణి గుండెనే చేరనీ
దాగనీ వెన్నెలా నిలపడం కష్టమే

29.1.2016
......................
26.
"తానునేను"..గజల్
తానునేను ఒక్కటనే తలపొక్కటి చాలదా
సడిసడిలో తొంగిచూసె పిలుపొక్కటి చాలదా
మంచులోని వేడవుతూ వెలుగుతుంది ధైర్యమె
ఊపిరిగా అనంతమై ప్రేమొక్కటి చాలదా
వయసెక్కడ దాగుందో తెలిసిందీ మనసుకే
దూరాలను చెరిపెస్తూ రేయొక్కటి చాలదా
కంటిచూపు లోతులలో భాషేమిటొ తెలుసుకో
కలహానికి చోటిస్తూ తోడొక్కటి చాలదా
హృదయాలే దాచుకుంటె విమలవాణి మురిసెలే
అనునిత్యం సేదతీరె చోటొక్కటి చాలదా

16.2.2016
..........................
27.
’రగిలింది’- గజల్
దిక్కులలో నిండలేక ప్రేమొక్కటి రగిలింది
నిశలన్నీ తరమలేక వెలుగొక్కటి రగలింది
మధురమైన బాషేదో తోడున్నా రమ్మంటె
భావమేదో జాడలేక స్వరమొక్కటి రగిలింది
మనసెంతా కాలిందో తనువేమో చెప్పనంది
మరణించని కాంక్షలతొ చితివొక్కటి రగిలింది
గమ్యమెటో.. తెగువేదో నేనున్నా పదమంది
గతితప్పిన అడుగులతో బాటొక్కటి రగిలింది
వీడమన్న వెతలన్నీ కలలలోనె ఒదిగాయి
నిశినిండిన విమలవాణి మనసొక్కటి రగిలింది

2.3.2016
........................
28.
"ఉన్నదీ"..గజల్ మహల్ ..2
మెరుపుబాల బాటపైన మురిపిస్తూ ఉన్నదీ
హోయలతో మనసంతా కరిగిస్తూ ఉన్నదీ
జాబిలి ఎందుకు పగలే ఉదయించెను ఈరోజు
సెగలన్నీ వెన్నెలగా తలపిస్తూ ఉన్నదీ
కన్నులలో కాటుకేమొ ప్రేమలేఖ పంపుతుంది
జడవిసురూ తాచులానె వెరపిస్తూ ఉన్నదీ
పైరువంటి పచ్చవోణి పరువాలకు పరదాయే
సిగ్గులలో మొగ్గవుతూ వలపిస్తూ ఉన్నదీ
బంతిపూల రంగంతా పావడాగ మురిసిందీ
కలలన్నీ కన్నులలో వెలిగిస్తూ ఉన్నదీ
ఉల్లాసపు మానసమే పరువానికి జతకలిసే
సరాగాల సయ్యాటకు గెలుపిస్తూ ఉన్నదీ
అందానికి రాజెవరో పండుగకే వచ్చెనట
సంక్రాంతి సంబరమే పిలుపిస్తూ ఉన్నదీ

16.3.2016
.......................
30.
"గుండెలోన శిల" - గజల్
గుండెలోన శిలలెన్నో దాచలేను నీవులేక
శ్వాసలోన వేడిలాగ నిండలేను నీవులేక
కన్నులలో నింపుకున్న రుధిరాన్నె ఆశ్రువుగా
వేదనతో ద్వారమునై నిలువలేను నీవులేక
మదిగాయపు కిటికీలో బొట్లుబొట్లు రాలుతుంది
చిధ్రమైన నాహృదయం అతకలేను నీవులేక
జ్ఞాపకాల బీడులపై మెరుపొక్కటి తాకాలీ
చూపుమబ్బు తొలకరినై కురవలేను నీవులేక
కాలమంత కొలిమిలాగ నిప్పుగడియ విసురుతుంది
నిశీధికే నీడలాగ రగలలేను నీవులేక
రాతిపూల కంటిబాట తుమ్మెదనై ఎగిరానూ
పరిమళాల సమాధిగా మారలేను నీవులేక
మౌనాలే గోడలైన కోటలోన బందీనీ
భేదించే సమరానికి పిలువలేను నీవులేక
ఎడారిలో కోయిలకై ఉన్మాదిల వెతికానూ
వేకువకై దిశలలాగ ఆగలేను నీవులేక

2.4.2016
......................
31.
మాలిక ఉగాది సంచికలో నా గజల్..
"సమయమిదే"..
మంచుపూల వలపు కబురు కరిగిపోయె సమయమిదే…
సూరీడూ నిప్పుటిల్లు చేరబోయె సమయమిదే…
శిశిరానికి ముడుచుకున్న తనూలతలు విరిసెనిపుడె
నవయుగాది తేజాలే చెలగిపోయె సమయమిదే…
పాటలతో కోయిలమ్మ సమరానికి సిద్ధమపుడె
నవరాగపు విందులకే పిలుపుపోయె సమయమిదే…
భయపెట్టే బ్రతుకు జాడ నవ్వుతుంది ఎపుడైనా
కలలజిలుగు వెలుగుతార ఎదురుపోయె సమయమిదే…
రైతన్నల కన్నులలో వెలుగు మొలక తొంగిచూచె
సందెలలో విమల వాణి మురియబోయె సమయమిదే
5.4.2016
.........................
32.
"వేచెనో".. గజల్
ఎడారిలో పాడాలని కోయిలెంత వేచెనో
నిదురపుచ్చు నమ్మికకై బ్రతుకులెంత వేచెనో
నిశలన్నీ చేరాయీ కన్నులలో కాటుకగ
రెప్పచాటు ఉదయానికి దిక్కులెంత వేచెనో
తారలెపుడు జాబిల్లినె బంధిస్తూ ఉంటాయి
అలసిపోతు అమాసకై చంద్రమెంత వేచెనో
ముళ్లదారి గులాబీలు ఆశలెన్నొ ఇస్తాయీ
చేరబోయె శిఖరానికి వేదనెంత వేచెనో
తరగబోని దూరమెపుడు చెలిలాగా పగదేలె
చల్లబరిచె ప్రేమతడికి శిలలెంత వేచెనో
రాలిపోయె పూవెపుడు చెదరబోదు మరణమని
ముగియబోయె మేనికొరకు జాలమెంత వేచెనో
జాడలేని వలపుపాట.. జతకెందుకు తొందరా
జారుకున్న కలకోసం రేయిఎంత వేచెనో
రాలిపడిన తారకలకు మనసుగుచ్చు కసియేల
చూపుపూల జాతరలో బేహరెంత వేచెనో

7.4.2016
...........................
33.
"నేర్చుకో".. గజల్
దాగున్న భావములు తెలియడం నేర్చుకో
మౌనాన లేఖలూ చదవడం నేర్చుకో
చీకటికి ప్రేమనే ఇచ్చునూ దీపమూ
తిమిరాన వెలుగుతూ నవ్వడం నేర్చుకో
ఓటమే లేదుగా మర్మమే తెలిసితే
గీతలో భావమై నడవడం నేర్చుకో
వేకువలొ వినమంటు పిలుపేదొ దాగుంది
ఊపిరిగ వెలుగులనె నింపడం నేర్చుకో
నీలాల కన్ను లా ..ముత్యాల సరాలా
ముళ్లన్ని ఏరేస్తు సాగడం నేర్చుకో
పున్నమై రాలేదు విందులకి జాబిల్లి
కిరణాల శరాలకు అలగడం నేర్చుకో
విషాదమె నిండగా కోకిలే ఓడింది
విమలవాణిలాగా పాడడం నేర్చుకో

16.4.2016
...............................
34.

"మెరుపుల్లో".. గజల్
కలలన్నీ కంటుందీ ఆశంతా మెరుపుల్లో
విరిగిందీ ఎడబాటుల రంగంతా మెరుపుల్లో
నవ్వబోకు నీవు అలిగి ముత్యాలే చెదురునూ
వలలెన్నో పరిచావూ మేనంతా మెరుపుల్లో
నిజాలన్ని దాచుకుంటు చూపుకోలాటమెందుకు
ఎంతెంతా దాగుందీ లజ్జంతా మెరుపుల్లో
చిరునవ్వుల జావళీకి ఇంకెంతా వేచాలీ
అడుగులెన్ని కలిసాయీ బతుకంతా మెరుపుల్లో
మబ్బుతెరలొ ఆకాశం దించుకుంది బరువంతా
తాకలేక చేరిందీ చూపంతా మెరుపుల్లో
బిడియమున్న కుంచెలతో మనసంతా అద్దాలీ
కాలమెంత బెదిరిందీ రేయంతా మెరుపుల్లో

21.4.2016
...........................
35.
"ఎడబాటు".. గజల్..
ఋతువులకు ఎడబాటు ..ఏమిటో వింతగా
ఎదలయకు ఎడబాటు.. ఏమిటో వింతగా
నీశ్వాసె నాలోన నిండింది ఎప్పుడో
ఇరువురకు ఎడబాటు.. ఏమిటో వింతగా
అడుగులో ముద్రగా మారాను ఎప్పుడో
తనువులకు ఎడబాటు.. ఏమిటో వింతగా
కంటిలొ పాపగా నాముందు చేరావు
మనసులకు ఎడబాటు.. ఏమిటో వింతగా
కాలంతొ కరగుతూ అలిసాము ఎంతో
మమతలకు ఎడబాటు.. ఏమిటో వింతగా
నీవెనుకె నానీడ కదిలింది ఎప్పుడూ
తలపులకు ఎడబాటు.. ఏమిటో వింతగా

26.4.2016
...................................
36.

"వారెవరో".. గజల్
రాలిపడే పూలలాగ నలుగుతున్న వారెవరో
దారిచూపె దివ్వెలాగ కరుగుతున్న వారెవరో
తీయనైన గాయమొకటి మనసుగిచ్చి వెళ్ళిందీ
దాచుకున్న తేనెలన్ని దోచుకున్న వారెవరో
చేజారిన గడియొక్కటి కంటిచివర చేరిందీ
చెప్పలేని మౌనాలను చదువుకున్న వారెవరో
పగళ్ళలో సెగలెన్నీ దోచాడో జాబిల్లీ
రేపుతున్న జ్వాలలతొ కాలుతున్న వారెవరో
అందుకున్న శిఖరాలకు ముళ్ళెన్నో కానుకగా
ఆశలన్ని నిలుపుకుంటు వెలుగుతున్న వారెవరో

27.4.2016
................................
37.
"వెన్నెలా"..గజల్
గుండెనిండా పండుతోందీ నీవునిండిన వెన్నెలా
కొంటెనవ్వులు రువ్వుతోందీ నీవుదాగిన వెన్నెలా
నీవురావని చెప్పుక్షణముల జతగవచ్చెను తిమిరమే
కంటికొలనులొ జలకమాడెను నీవుపంపిన వెన్నెలా
చూపుతడిపే జాబిలమ్మకు నిద్దరొచ్చిన తిమిరమే
మనసుమూలలు నిండుతుంది నీవువంపిన వెన్నెలా
గుండెలోతుల మెరుపుతారను మింగుతుందీ తిమిరమే
నాదుపదముల వాలుతోందీ నీవుకురిసిన వెన్నెలా
పెదవిమాటున గుట్టులేవో విప్పుతుందీ తిమిరమే
అలకనీడను తరుముతుందీ నీవునవ్విన వెన్నెలా

7.5.2016
............................
38.
"చూడూ".. గజల్
చెక్కిలి మీటిన జాబిలి కిరణము మురుపును చూడూ
హద్దులు వదిలిన ఊహల ఊయల పిలుపును చూడూ
వెలుగులు ముగిసిన చీకటి నింగిని మింగును వేగమె
గూడుకు సరగున కదిలెడు కొంగల తీరును చూడూ
చినుకుల జాడకు వేచెడు చూపులు తనువులు అలసెను
తడిసిన ధరిత్రి రువ్విన గంధపు వలపును చూడూ
మోమును చేరిన అలకల కలిమికి వగచెను గులాబి
అధరపు అరుణము చేరీ మించిన సౌరును చూడూ
వంపున విరిసిన హాసము పిలుపుకు మరులే రేగెను
రయమున హృదయము చేరే ఆశల బారును చూడూ

15.5.2016
.........................
39.
"వేకువలో".. గజల్
వేకువలో కన్నుల తెర తెరిచాయని తెలిసిందీ
యామినిలో సిగ నగలే చెదిరాయని తెలిసిందీ
చూపులలో నిలువలేని తుళ్ళింతలు ఎందులకో
రెప్పలలో నీరూపం దాచాయని తెలిసిందీ
రాయంచల నడకలలో తడబాటే ఎందులకో
వగలన్నీ నీదరికే తరిలాయని తెలిసిందీ
కనుసైగకు అధరాలే ఒణికినవీ ఎందులకో
మకరందపు విందులకే వేచాయని తెలిసిందీ
మేఘానికి మిడిసిపాటు చెదిరిందీ ఎందులకో..
తటిల్లతలె నీమేనున మెరిసాయని తెలిసిందీ
గుండెలలో నిశినీడల ముసురేసెను ఎందులకో
విమలవాణి చిరుజల్లులు కురిసాయని తెలిసిందీ

20.5.2016
...............................
40.

"నీవేలె"...
వేకువ మదిలో రేకులు విప్పిన రాతిరి కలవే నీవేకాదా
దాగిన ఆశలు రేపేనవ్వుల పున్నమిబాలవు నీవేకాదా
తాకగతనువే మురిసీవిరిసే వెన్నెలశకలము ప్రియతమనీవే
అలసినకన్నులు ఓపకవెదికే పరిమళశయ్యవు నీవేకాదా
పదములవేటలొ అందీఅందని మరీచికవేలె సఖియానీవే
ఘడియలుమించుతు జాములుకరుగుతు రేగేబాధవు నీవేకాదా
వేచినకలలే తీరాలాయే నవ్వులనదిలో ఓహోచెలియా
చూపులచురుకున దూరమునిలిపే మోహపుతరగవు నీవేకాదా
నిదురేలేనీ నిశీధిరాతిరి సేదతీర్చే జవ్వనినీవే
కళలే వలచే..వలలే పరిచే తరుణీరూపువు నీవేకాదా
ఘల్లున మోగే అందెలసందడి పిలుపులఆగదు మనసేఏలో
అడుగులతారలు వదిలినసొగసరి కిరణపుతునకవు నీవేకాదా

6.6.2016
...................................
41.
"ఉన్నదీ".. గజల్
కాలానికి గాలాన్నె వేయాలని ఉన్నదీ
ఆశలచితి చిరునామా తెలియాలని ఉన్నదీ
దెబ్బలెన్ని మోసినదో ఈచక్కని బొమ్మా
నొప్పించని ఉలిదెబ్బను కావాలని ఉన్నదీ
వ్యధలెన్ని దాచినదో ఈ సొగసులమాలిక
భావాలకు హృదయాన్ని పరవాలని ఉన్నదీ
గుండెలెన్ని చీల్చినదొ ఈసన్నని ఛూరిక
గాయాలకు నెలవుగాను మారాలని ఉన్నదీ
ములుకులెన్ని తాకినవో ఈపల్చని జీవిక
బంధాలకు భాష్యాలను తెలియాలని ఉన్నదీ
నీడలెన్ని చూసినదో ఈనవ్వుల తారక
వెలుగులన్ని బాటలుగా మార్చాలని ఉన్నదీ
ఎడదలోన కొలువైనది ఈ తీయని జ్ఞాప్తిక
మరణంతో వైరాన్నె పొందాలని ఉన్నదీ
తనువులెన్ని తాకినదో ఈచల్లని వీచిక
శ్వాసలతొ ఆశలనే కొలవాలని ఉన్నదీ

9.6.2016
................................
42.
"ఎంత హాయీ"... గజల్..
వెన్నెలొదిలిన కిరణమొక్కటి మదినితడిపిన ఎంతహాయీ
స్వప్నసౌధపు విరులు ఏవో వలపుపంచిన ఎంతహాయీ
వేణుగానము తీయదనముకు తనువునాపగ తరముకాదే
కలలనద్దిన తేనెఝరులే బ్రతుకుజారిన ఎంతహాయీ
జామురాతిరి జాబిలమ్మకు అలకలేవో గురుతుకొచ్చెను
లాలనలలో రేయి అంతా కరిగిపోయిన ఎంతహాయి
వెలుగు దాగిన కంటిపాపకు తోడు ఏదో తెలియకున్నది
చూపునిండిన అందమంతా గూడుకట్టిన ఎంతహాయీ
ఆకుఆకున ముత్యమల్లే పదములెన్నో కూడుతున్నవి
గుండెపాటకు రాగమేదో తెలియవచ్చిన ఎంతహాయీ
ముసుగుచెదరిన మాటలన్నీ మనసుజాడను తెలుపుతున్నవి
బ్రతుకునీడకు మెరుపులిచ్చిన నవ్వులందిన ఎంతహాయీ
అంతరంగపు వలపుగంధము దారిచూపగ తీరమేదో
భవ్యపథముకు గమనమెరిగిన మువ్వనయ్యిన ఎంతహాయీ
కడలితరగకు వెన్నుమెరుపుగ గడియనిలిచిన మధురమేలే
విమలవాణిగ స్నేహహస్తపు మధువులందిన ఎంతహాయీ

22.6.2016
.............................
43.
"వెలుగుచెలమ".. గజల్
వెలుగుచెలమ నీవుంటే నిశఎక్కడ దొరుకుతుంది
మధువులన్ని జతకడితే విషమెక్కడ దొరుకుతుంది
ముసురుకున్న ఊహలన్ని రాయబోగ ఎగసిపడెను
సెహబాసని మెప్పందగ పదునెక్కడ దొరుకుతుంది
సంద్రంలా సుడులెన్నో దాచుకుంది జీవితమే
పొడిబారిన రెప్పలతడి పఠనెక్కడ దొరుకుతుంది
తడబాటుల అడుగులన్ని పయనంలో చిగురులాయె
వసంతముకు తనువివ్వని మానెక్కడ దొరుకుతుంది
కన్నులలో వెదికానూ మరిచిన నా చిరునామా
బికారైన ప్రవాసీకి వరమెక్కడ దొరుకుతుంది

21.7.2016
.............................................
44.
నిజమయ్యే కలలాగా పిలుపేదీ లేదుకదా
స్మృతిలాగా పాతబడిన మధువేదీ లేదు కదా
కత్తులెన్నొ నాకోసం అక్షయంగ దాచావూ
నీకోపాన్ని మించిన పదునేదీ లేదుకదా
విరాగినై శిశిరాన్నె నిలిపానూ హృదయంలో
దిగంతాల నీనుండీ జాబేదీ లేదుకదా
గాలివానకు గూడేది చెదరకుండ ఉంటుందా
నన్నునేను దాచుకునే రెక్కేదీ లేదుకదా
వెలుగుతున్న కన్నులలో నారూపం దొరకలేదు
తనువులకూ తలపులకూ తగువేదీ లేదుకదా

31.6.2016
...........................
45.
వసంతాల విలువెంతో పొడికంటికి తెలుస్తుంది
చెలిమేమిటొ అలతాకిన తీరానికి తెలుస్తుంది
కలలన్నీ బొమ్మకట్టి చెలియరూపు ఎదుటనిలిపె
స్వప్నసౌధము ఏలికెవరొ రెప్పసడికి తెలుస్తుంది
చినుకుతడికి తరువులన్ని ఆకుఆకు పరుచుతాయి
ప్రేమలోన బాధ ఎంతో విరహానికి తెలుస్తుంది
భావసుమపు గంధముతో పరిమళించె అక్షరాలు
మధురమెంతొ గీతమైన హృదయఝరికి తెలుస్తుంది
బ్రతుకుపొత్తము పుటపుటలొ మరులుగొలిపె గాలాలే
మర్మమెరుగుతు సాగాలని పాంథునికి తెలుస్తుంది

5.8.2016
.................................
46.
వెలుగురవ్వల ప్రాయమెంతో.. నిలుపగలిగిన హాయికాదా
నిశలనీడల చెలిమిఎందుకు .. కాంతులొలికిన హాయికాదా
బతికి ఉండే కాలమెంతో తెలియగలిగిన ఘనముకాదే ..
పథముసాగుతు జనముమదిలో నిలిచిపోయిన హాయికాదా
ఎడదనిండిన స్నేహభావము జగముపంచిన వెలుగులిచ్చును
మదితిమిరాలు మెల్లమెల్లగ తొలగిపోయిన హాయికాదా !
మీరలేనని దూరభారము తలపుకెందుకు అద్దుకుందువు
రెప్పకాలము మనసువేగము.. మరువకుండిన హాయికాదా
సారమెరుగని చింతలేనీ బతుకుకెందుకు కలలుకందువు
గాడినలిగిన జీవితానిని స్వాగతించిన హాయికాదా

6.8.2016
.............................
47.
యుగాల దాహం తీర్పగ పిలిచే వెన్నెల ధారా
స్నేహపు రాగము నేర్చిన మనసే వెన్నెల ధారా
యామిని సిగలో నగలై తారలె చేరే సమయము
అనంత స్వప్నపు వీణియ మీటే వెన్నెల ధారా
కన్నుల కలహము ముదరగ మదిలో తలపుల సందడి
తనువుల విరహం మాయగ విరిసే వెన్నెల ధారా
మాటల లోతున కథలే దాగును దొరికిన మధురము
ఆశల మౌనం తీరము చూపే వెన్నెల ధారా
అక్షరం కౌగిలి వీడని కవినే చెలిలా చేరును
భావపు సంద్రము అలలో పొంగే వెన్నెలధారా

8.8,2016
............................
48.
రెప్పలలో బొమ్మ ఏదొ.. వెతుకుకొనుట సులువుకదా
ప్రతిఅణువూ తానేనని తెలుసుకొనుట సులువుకదా
జాబిలి దోబూచాటలొ తారలన్ని మునిగినవీ
చెలినవ్వులు హృదిగగనం నింపుకొనుట సులువుకదా
చిగురాకులొ పల్లవించు ఆశయేలె జీవితం
క్షణములలో వసంతాలె పూయించుట సులువుకదా
విరోధాల కౌగిలిలో ఒంటరిగా వేదనేల
మదిగంధపు చెలిమిపూలు పంచుకొనుట సులువుకదా
అలుకెరుగని నేస్తంలా ఆనందం తోడున్నది
విమలవాణి బాటలోన సాగిపొవుట సులువుకదా

13.8.2016
.......................
49.
యామినివై ప్రణయాన్నే వెలిగింతువు వెన్నెలగా
చూపులలో లేఖలెన్నొ కురిపింతువు వెన్నెలగా
కాలమంత రాలుతుంది రేయిపూల రేకులుగా
నీఊహల సుగంధాన్ని పరిపింతువు వెన్నెలగా
జాడలేని జాబిలికై కలువలన్ని వేచినవీ
స్నేహార్ద్ర గీతాన్నె వినిపింతువు వెన్నెలగా
మధుమాసపు పలకరింపు తొంగిచూచు నీజతలో
మధువులలో మత్తులన్ని అందింతువు వెన్నెలగా
మనసునంత అల్లుతుంది వలపుతీగ నీరూపై
నిదురబాట కలలరజను జల్లింతువు వెన్నెలగా

22.8.2016
.................................
50.
మౌనానికి మూలమేదొ చెదురుతోంది అదేమిటో
ఘడియలలో బరువెందుకొ కరుగుతోంది అదేమిటో
వ్యధలనే మోయలేక బతుకురథం కుంగుతుంది
ఊపిరూదె ఆశ ఒకటి దాగుతోంది అదేమిటో
కరిగిపోయె అలలతీరు చెదిరిపోయె కలతలెన్నొ
‌‌విసుగులేని నిశ ఒక్కటి తరుముతోంది అదేమిటో
బాటనిండ పలకరించె జ్ఞాపకాల పూవులెన్నొ
శిధిలమైన స్వప్నమొకటి వెలుగుతోంది అదేమిటో
ఓపికెంత దాచిందో మండుతున్న ఆకలిని
నిప్పురవ్వ చల్లదనం తాకుతోంది అదేమిటో

28.8.2016
..................................
51.
అశ్రుబిందువుల వేడితాకని కవనమెక్కడ నిలువగలదూ
కదనరంగపు కారుచీకట శాంతమెక్కడ నిలువగలదూ
చెరిగిపోయిన గురుతుకోసం తరగలెంతో వెతుకుతున్నవి
లోనదాగిన వెలుగురేనితొ కలహమెక్కడ సాగగలదూ
చెలిమితోడుగ ధైర్యముండిన అడుగుసాగును సిరులబాటను
జీవితంలో కష్టసుఖముల జూదమెక్కడ నిలువగలదూ
అరుణమందిన చెక్కిలిపైనె చూపులెన్నో గుచ్చుతున్నవి
అదునుదొరికిన వలపుబాణము జాగుఎక్కడ నిలువగలదూ
తాకిపోయే అలలమనసున చిలిపితనమే దాగిఉన్నది
పున్నమొచ్చిన వలపుతాకిడి తీరమెక్కడ నిలువగలదూ
వైరులెవరో తెలియలేనీ బతుకుపోరున యోధులెవరో
వెలుగురాగము ఆలపించిన నిశీధెక్కడ నిలువగలదూ

7.9.2016
.....................
52.
నీ ప్రేమె శ్వాసగా చేరుతూ ఉంటుంది
నీపేరె గుండెలో మోగుతూ ఉంటుంది
కంటిలో జాబిలై నీరూపు కొలువుంది
మనసులో తిమిరమే చెదురుతూ ఉంటుంది
తనువెంత పావనమొ వృద్ధులకు సేవలో
మేధస్సు ఆ వరమె కోరుతూ ఉంటుంది
బాధలో సారముగ జ్ఞానమే మిగిలింది
మదిలోన తోడుగా వెలుగుతూ ఉంటుంది
వేదనల చీకటులు అమాసకు సొంతాలు
మిణుగురే ఆశగా వెదుకుతూ ఉంటుంది

8.9.2016
................................
53.
మంచితనపు చెలిమిపూలు పంచుకొనిన సుఖముశాంతి
సమభావపు ప్రణయాలే కురిపించిన సుఖముశాంతి
రాలుతున్న నవ్వుపూలు గంధమెంతొ జల్లుతున్నవి
మనసుపలుకు గమకాలను పరికించిన సుఖముశాంతి
మదికోరిన ప్రియరూపం గగనంలో జాబిల్లీ
మేఘములా హృదయంలో దాచుకొనిన సుఖముశాంతి
జారిపోయె క్షణములు గమనించావా ఎపుడైనా
ముత్యమయ్యె గడియేదో తెలుసుకొనిన సుఖముశాంతి
నీవెవరని నిన్నునీవు అడిగేవా ఒక్కసారి
నిక్కమైన చిరునామా తెలుసుకొనిన సుఖముశాంతి

12.9.2016
......................................
54.
అశ్రులన్ని కవనాలే ... రాసేందుకు వీలుకాదు
మదిగాయపు లోతెంతో.. కొలిచేందుకు వీలుకాదు
నిదురివ్వని కలలదొంగ నేనేనని అంటావూ
ఎడమివ్వని వైనాలను దాచేందుకు వీలుకాదు
జాడలేదు ఇనకిరణం.. ముకుళించెను తరువులన్ని
వియోగాల మౌనమెంతొ తెలిపేందుకు వీలుకాదు
పరుగులిడే గడియలతో పంతమేల హృదయానికి
రేరాజును బంధనాల నిలిపేందుకు వీలుకాదు
వికసించిన పూవులలో వలపెంతో దాగుందీ
వనమాలికి మురిపమెంతొ తెలిసేందుకు వీలుకాదు

30.9.2016
.........................
55.
వెలుగువద్దని చీకటుండిన విజయమేమిటి చేయగలదూ
కోరికొక్కటి వేరులూనిన స్థిమితమేమిటి చేయగలదూ
కాంతినింపే చిన్ననవ్వుకు వేదనెంతో వెదుకుతున్నది
వెలుగురేడే జాగుచేసిన తిమిరమేమిటి చేయగలదూ
వైరిలోకము చిన్నబోవగ గుండెధైర్యము కొలువుదీరును
మనిషిలోపల శాంతిరేఖకు ద్రోహమేమిటి చేయగలదూ
భావలోకము చెలిమితోనే కావ్యనిధులకు మెరుగుదొరుకును
పదముఅర్ధము తెలియకుంటే పండితేమిటి చేయగలదూ
పూవులోపల తావివోలే మంచి మనిషిలో గుబాళించును
తామరాకే మనసుఐతే పంకమేమిటి చేయగలదూ

2.10.2016
................................
56.
వలపేమిటొ అలతాకని తీరమెలా చెప్పగలదు
కంటకాలె పాఠమనీ వేదనెలా చెప్పగలదు
రెప్పవెనుక కలలనిండ చోరునిలా చేరతావు
మదిభావం దాచకుండ నయనమెలా చెప్పగలదు
అలకలోన కంటిచూపె కలహానికి కరవాలమె
మౌనానికి బరువెందుకొ విరహమెలా చెప్పగలదు
దాచుకున్న తపనలన్ని పెదవివణుకు తెలపలేదు
సిగ్గులోన అందమెంతొ సరసమెలా చెప్పగలదు
అడుగులలో వనములెన్నొ కానుకిచ్చు ఆమనివే
నిజమయ్యే స్వప్నమేదొ కోరికెలా చెప్పగలదు
లోతులేని సంద్రమేదొ ఆశ్రువుకే తెలుస్తుంది
తుదివరకూ నేస్తమెవరో ఊపిరెలా చెప్పగలదు

18.10.2016
....................................
57.
ఆశలే పూసేటి తరువొకటి కావాలి
కాంతులె మొలిచేటి వేరొకటి కావాలి
నీజాడ కనరాక చీకటే నిండింది
వెన్నెలే ఒలికించె లేఖొకటి కావాలి
కంటిలో చోటుకై కాంతులె వేచాయి
కలిసేటి క్షణముకై వరమొకటి కావాలి
కవ్వింత లేనట్టి వలపునే పంచాలి
కరుణించ చెలియకే చూపొకటి కావాలి
వీణపై రాగమే నాట్యాలు నేర్చింది
మనసులో మౌనాల తుదివొకటి కావాలి
మూలాలె మరపించు పయనాలె అన్నీను
తిమిరమును జంకించు వెలుగొకటి కావాలి
వేదాలె తలవంచు పాఠాలు నేర్వాలి
ముళ్ళెన్నొ అందించు బాటొకటి కావాలి
పనిలోన మధురమే తెలిసున్న మనిషివే
బతుకంత వరముగా తలపొకటి కావాలి

24.10.2016

58.
బాధలో బరువులో సైరించు తోడుకై నిలవడం అవసరం
గతించిన పర్వాలకు గుండెలో మధుపాత్ర దాచడం అవసరం
పైరులే నవ్వగా పుడమిలో నాకమై జగమంత వెలుగులే
నగరాల మోజులో పరుగెంత సాగునో తలవడం అవసరం
తుదిలేని తిమిరాన వేదనే చెలిమిగా సాగెలే పయనాలు
కళలతో జతలోన దాగున్న స్నేహమే తెలియడం అవసరం
చేతిలో గీతగా రాసున్న సౌఖ్యమె అందనీ గమ్యమే
బాటలో అడుగులో ములుకులే తీరుగా ఏరడం అవసరం
ఋతువుకే రాణిగా వసంతమె మురిసింది గర్వాన పొంగుతూ
అశ్రువులే కావ్యమై శిశిరమే ఒదగగా చదవడం అవసరం
మనిషిలో మమతలో వెలుగొందు విలువలో దాగుంది పరమమే
నడిపించు వేదమే తేజమై భవితనే దిద్దడం అవసరం

11.11.2016

59.
తూర్పువెలుగులు ప్రణవనాదపు రావమేనని తెలుసుకున్నా
విరుగుచీకటి మనసుతిమిరపు రూపమేనని తెలుసుకున్నా
వెలుగునీడలు చెదురుతుంటే జీవితమిదని నేర్చుకున్నా
గురుతులెన్నో చెరుపుతుంటే కాలమేనని తెలుసుకున్నా
పరుగులీడే ఘడియలన్నీ నిలిచిచూచిన వైనమేదో
వలపుపండిన కలలకౌగిలి తరుణమేనని తెలుసుకున్నా
తేనెలూరే కవనగానపు అర్థమేమో వెతుకుతున్నా
బతుకులయతో జతకలిసిన భావమేనని తెలుసుకున్నా
మూయలేనిది కంటివాకిలి జాలిలేనిది మోముజాబిలి
పున్నమంటే రెప్పకాలపు పర్వమేనని తెలుసుకున్నా

17.11.2016

60.

తీరని ఆశల వెతలకు మలాము పూస్తవి కన్నులు
హృదయము లోనే శీతల వనములు కంటవి కన్నులు
వేచిన చూపుల గానము వింటూ మరలెను రాతిరి
వెలుగుల వేకువ కిరణము పిలుపని లేస్తవి కన్నులు
కోరిన ఘడియలు ఎదురే కాగా మాటలు మరచును
ప్రియమగు రూపుకు కాంతుల కొలుపులు చేస్తవి కన్నులు
తలపుల తరువుకు పూచెడు పూవులు నయనపు మెరుపులు
దూరము గానే అధరపు రుచులను చూస్తవి కన్నులు
పూచిన సొగసుల పానపు మత్తున లోతుగ మునిగెను
అనంత గానపు పల్లవులు తీయగ రాస్తవి కన్నులు
సవ్వడి చేయని రెప్పల తలుపులు ఆగని పిలుపులు
మదనుని శరముల ధీటుగ అల్లరి దూస్తవి కన్నులు
చెదరిన స్వప్నము మనసును కోయుచు వేదన నింపును
వెన్నెల శకలను చేరగ దారులు కాస్తవి కన్నులు

27.11.2017

61.

తనపలుకు సవ్వడే గొంతులో పాటగా ఒదుగుతూ ఉంటుంది
నాలోన శిశిరాల గాయమే ఎందుకో మండుతూ ఉంటుంది
ఏడేడు వర్ణాల రధముపై శ్వేతాస్త్ర ధారియై నాచెలియ
ఖడ్గమై వేటాడే క్షణముకై నయనాల వెదుకుతూ ఉంటుంది
ఒంటరగు నాజతకు చిరునవ్వు మెరుపులే విసిరేటి శత్రువే
మసలేటి రుధిరమే కావ్యాన సమిధగా మారుతూ ఉంటుంది
కంటిలో అరుణించు రేఖలే తనచిత్రం చూపుతూ ఉంటాయి
కాలమే మౌనిగా స్వప్నాల ఇల్లంత అలుకుతూ ఉంటుంది
శ్వాసించు గంధాల వనములో వలపులే పూవులై పూచాయి
గుండెలో తనతలపు సమీరం మధువులే ఒంపుతూ ఉంటుంది
అరచూపు సైగలో చిరునవ్వు తీరులో ప్రాణాలు దాస్యమే
మాటలో రవళించు మౌనాల అర్ధమే చెదురుతూ ఉంటుంది

12.12.2016

62.

వేకువలో ఒదగాలని అరుణాలకు ఎలాతెలుసు
వెనుదిరగని ఇనకిరణం విజయాలకు ఎలాతెలుసు
నిముషమైన ఆగలేని పయనాలే రేరాజువి
రెప్పలలో దాచాలని నయనాలకు ఎలాతెలుసు
ఆగనిజడి తీరనికల వేచిన ఒడి చేరెవరకు
పంతాలే నిలపాలని కెరటాలకు ఎలాతెలుసు
రేయికెపుడు ఎదురుచూపు గాయాలే తనువంతా
లేపనాలు అద్దాలని స్వప్నాలకు ఎలాతెలుసు
మౌనించిన హృదయానికి వసంతాలె తాకినవీ
సుధలతేనె ఒలకాలని అధరాలకు ఎలాతెలుసు
పొడిబారిన జీవితాన కలలమధువు ఒలికిపోయె
చిగురాశల విత్తులేవొ కవనాలకు ఎలాతెలుసు

25.12.2016

63.
కలలమబ్బు నాలోనే కురిసినట్లు ఉందేమిటి
కంటిలోన దాహాలే వేచినట్లు ఉందేమిటి
గుండెలలో వైరాన్నే చెదరనీకు మనిద్దరకు
సౌఖ్యానికి బానిసగా మారినట్లు ఉందేమిటి
ఎదతలుపులు మూసివేసి నిదురించా ఒంటరిగా
నిశబ్దాన ననుఎవరో పిలిచినట్లు ఉందేమిటి
చేరకుండ మదితలపుల గడియలన్ని బిగియించా
నాలోపల ఇటుఎవరో దాగినట్లు ఉందేమిటి
నానీడలో నిన్నెప్పుడు వెతకలేదు నిజమేలే
ఒకమౌనం ననుఎక్కడొ తాకినట్లు ఉందేమిటి

15.1.2017

64.
భవమును గెలిచిన మనసున తీరని మథనం ఉన్నది
న్యాయం తప్పని మనిషికి బెదురుతు నటనం ఉన్నది
తీరం చేరని అలలూ కంచికి చేరని కథలూ
బ్రతుకున విధికే ప్రియమై ఘనమగు కదనం ఉన్నది
అడుగుల దాగిన అలసట చూచే కన్నులు ఏవో
స్నేహపు లోతులు తెలిపే హృదయపు పవనం ఉన్నది
చుక్కల నింగై ఆశల రజనును చల్లును చెలియే
దాచిన వలపును తెలిపే అధరపు చలనం ఉన్నది
చెదిరే కలలకు ధీరత వెదుకుతు పయనము సాగును
గమ్యపు వెలుగులు హృదిలో నింపుతు కవనం ఉన్నది

20.1.2017

65.
కాలము నడకకు చీకటివెలుగుల సరసపు నాటిక అవసరమేగా
కన్నుల నోముకు ఫలితము కోరిన సొగసుల వరమిక అవసరమేగా
సౌఖ్యపు కౌగిలి నిలవాలంటే నమ్మిక తోడే తప్పనిదేగా
తిమిరపు వేడుక చెదరగ హృదిలో కాంతుల వేదిక అవసరమేగా
శిశిరపు కోకిల ముందే పాడగ ఒంటరి మనసును ఆమని తాకెను
దాగిన మౌనము పలకాలంటే సరిగమపదమిక అవసరమేగా
లోహపు మనసుకు ఊహల చిత్తడి తెలిసే ఋతువుల తరుణము ఎపుడో
వర్ణపు చాపము పొందాలంటే చినుకుల చెలిమిక అవసరమేగా
బతుకే జటిలము సింగపు కౌగిలి కోరే తెగువకు సలాము ఎందుకు
శోకపు నావకు వెలుగుల సంగమ తీరం చేరిక అవసరమేగా

29.01.2017
66.

కలిసిగడిపిన తరుణములలో మధువులెన్నో చెప్పగలవా
మనసువిడువని గతముదాచిన భాష్పమెంతో చెప్పగలవా
ముళ్ళురాలిన గులాబీలే బాటనిండా పరుచుకొన్నవి
క్షణమువదలక మనమునడిచిన దూరమెంతో చెప్పగలవా
శిశిరుఋతువున నీవువ్రాసిన లేఖలన్నీ మాయమైనవి
అశ్రుధారతొ ఆరిపోయిన జ్యొతులెన్నో చెప్పగలవా
ఊపిరులలో సందడించే రవళులేవో నిండుకున్నవి
కాలయవనిక ఎదురుచూచిన అడుగులెన్నో చెప్పగలవా
ప్రజ్వలించే వెతలజ్వాలకు శీతశిలలే కరుగుతున్నవి
సుఖపుజతకై తనువు వెదికిన ఋతువులెన్నో చెప్పగలవా

12.02.2017

67.
ప్రణయానికి ఒకరూపం వెదకాలని ఉన్నదీ
సుడిగాలికి ఇంతచోటు దాచాలని ఉన్నదీ
సిగ్గులొలుకు గులాబీలు నన్నుచూసె నవ్వినవా
ప్రియరాగపు ఆలాపనె పాడాలని ఉన్నదీ
ఆ వెన్నెల సడిచేయక నా కోసం రాలిందా
అమాసలకు అర్థాలేవొ తెలియాలని ఉన్నదీ
ఓరచూపె భాగ్యమై నన్నుతాక చేరిందా
నిధులెన్నో తెలియవనీ చెప్పాలని ఉన్నదీ
వసంతమే దరిచేరగ నాకోసం వచ్చిందా
ఋతువెందుకు మధువులకని అడగాలని ఉన్నదీ
విమలవాణి స్నేహాన నాలోపల దాగిందా
వేదనకే చిరునామా చెదరాలని ఉన్నదీ

28.02.2017
68.

కోపంలో నీవుంటే తెరువెక్కడ ఉంటుంది
నిప్పులన్ని జతకడితే చెలమెక్కడ ఉంటుంది
వలపులోన మరణాలకు లోటేమీ లేదులే
చూపులోన మంత్రానికి తిరుగెక్కడ ఉంటుంది
ఊహలన్ని రాయలేక కలంఅలసి పోతున్నది
నిజమయ్యే నీపిలుపుల మధువెక్కడ ఉంటుంది
చిరుగుగుండె అతుకులన్ని తరచితరచి వెదకలేను
కుట్టుపడని మాసికలకు సూదెక్కడ ఉంటుంది
గాయానికి రూపంగా నాగుండెను మార్చావు
కరుణించే నీకంటే ప్రియమెక్కడ ఉంటుంది
కన్నులలో వెదికానూ మరిచిన నా చిరునామా
బికారైన ప్రవాసీకి వరమెక్కడ ఉంటుంది

20.03.2017

69.

చూపులలో మధువులనే ఒంపుతుంది ఆ చిన్నది
పెదవులపై లేఖలనే చదవమంది ఆ చిన్నది
రేరాజే జల్లులలో రేయంతా తడిపెనేమొ
 తనువంతా కాంతులను నిలుపుకుంది ఆ చిన్నది
వసంతాన పూవులలో వలగంధమె దోచెనేమొ
శ్వాసలలో శ్రీగంధమె నింపుతుంది ఆ చిన్నది
పసలేనివి ..వాదులతో కాలానికి పరుగేలా
క్షణములను కవితలుగా రాయమంది ఆ చిన్నది
అమాసలను కాటుకగా కన్నులలో దాచుకుంది
వెన్నెలలో నెలవంకనె మించుతుంది ఆ చిన్నది

24.03.2017

 70.

మేఘాలకు కలలతావి అద్దుతాయి ఆ చూపులు
దూరాలకు కొలతలనే చెరుపుతాయి ఆ చూపులు
ప్రియభావన ఒకటేదో రెప్పలలో చేరెనేమొ
పులకలతో అరుణాలై చెదురుతాయి ఆ చూపులు
నీరవాల దారులలో అలవోకగ తాకుతాయి
నిరీక్షణకు పంతాలే పెంచుతాయి ఆ చూపులు
చిరుగాలుల అల్లరిలో పిలుపులేవొ తెలిసెనేమొ
తనువులోన అలజడులను తెలుపుతాయి ఆ చూపులు
మనసులోని భావాలను దాచలేని అద్దాలే
విమలవాణి జతచేరీ వెలుగుతాయి ఆ చూపులు

14.04.2017

71.

తీరానికి చెలిమేదీ కడలితరగ లేకుంటే
తిమిరాలకు జడుపేదీ వెలుగుముద్ద లేకుంటే
చితిమంటల తుదిలేనివి తలరాతలు వెంటాడును
ఋణమెప్పుడు తీరేదీ ఈ పుట్టుక లేకుంటే
అడుగడుగున బంధనాలు చీకటిలో పయనాలూ
నిన్నునీవు చేరెదెపుడు చివరిగడప లేకుంటే
అందుకునే ఆశయమై దరిచేరదు మేరునగం
లోలోపల ఇంధనమై చిన్నతపన లేకుంటే
బీడుబారి మానసమే కుములుతుంది ఒంటరిగా
మొలకేదీ పెరగదులే చెలిమితేమ లేకుంటే

20.4.2017

72.

వెతలజాడ చెరపాలని ఉరుకుతుంది వానచినుకు
ఎదురుచూపు బీడులన్ని తడుపుతుంది వానచినుకు
పగులుతున్న గుండెలతో ఎండుతున్న పైరులెన్నొ
ప్రేమతోని అమ్మలాగ తాకుతుంది వానచినుకు
ఎదురుచూచు గిరితరువుల తనువులన్ని విచ్చినవీ
రసగంగా తరంగమై దూకుతుంది వానచినుకు
సుగంధాలు జగమునంత నింపాలని ఆశించును
చిగురాశల పూవులేవొ వెతుకుతుంది వానచినుకు
తాకరాని చోటేదో తెలియలేని రాలుగాయి
ఎక్కడైన ఎప్పుడైన మీటుతుంది వాన చినుకు
పుడమి తాకి సంతసాన తుంపర్లై నాదించును
విమలవాణి మధురాన్ని తెలుపుతుంది వాన చినుకు

4.06.17

73.
తలపులిచ్చు హాయికన్న మధువేదీ లేదుకదా
కలలబొమ్మ దరిచేరే వరమేదీ లేదుకదా
చెలిమువ్వల నాదంలో పిలుపులేవొ వింటున్నది
మత్తెక్కిన హృదయానికి అదుపేదీ లేదుకదా
చిగురాకుల చీరలలో సిగ్గులొలుకు వనములన్ని
వసంతాన అందాలకు లోటేదీ లేదుకదా
తరువైనా శిలయైనా ఒక్కలాగె స్పర్శించును
చినుకులోన భేదమెంచు గుణమేదీ లేదుకదా
మార్పులను రమ్మనుటే కాలచక్ర నైజమేమొ
అలసించగ నెపమువెతుకు ఋతువేదీ లేదుకదా
మనసులన్ని తాకాలని కోరుతుంది విమలవాణి
కవిభావము తెలపలేని కలమేదీ లేదుకదా

07.07.17

74.
పసివై గడిపిన క్షణములు దొరికే తీరము ఏదో
మమతల కౌగిలి నీవై మురిసే తరుణము ఏదో
వెలుగులు పంచే అందము దొరికిన రాతిరి నిలవదు
వెన్నెల పూవై సిగలో చేరిన వైనము ఏదో
వెతికే కంటికి లోపలి లోతులు అందక మానవు
పైపై మెరుగుల నిజములు తెలిసే మర్మము ఏదో
ఉరికే మనసుకు నిలకడ ఉండదు దారులు వెతుకును
తనలో సత్యము తెలిసిన మునియౌ సమయము ఏదో
విషములు పంచే మోసపు దారులు మదిలో చేరును
సుఖముల కావల కలగా మిగిలే గమ్యము ఏదో

10.09.17

75.
నా గుర్తు నీతలుపుకె ఇచ్చేసి వచ్చాను
నా ఉనికి నీ శ్వాసలొ మరిచేసి వచ్చాను
దాతగా నాపేరే మోగుతూ ఉన్నది
బాటలో ప్రాణమె పరిచేసి వచ్చాను
కవినేమిటో నేను నాకేమి తెలుసు
నీ పేరె సభలోన చెప్పేసి వచ్చాను
గాయమెపుడైనదో..అసలెందుకైనదో
వెర్రినై నీ చుట్టు తిరిగేసి వచ్చాను
దారిలో రాయిగా పడిఉండనీ అలా
శిఖరాల కొసలేవొ తాకేసి వచ్చాను

25.09.17

76.

నీతలపు నాలోన చినుకులా రాలింది
నీఅలక సంకెలై నిశిలోన నిలిపింది
కంటిలో జాడలై దాహాలు వేచాయి
తెమ్మెరై నీ చూపు తడిపేసి వెళ్ళింది
బాటలో ముల్లుగా వేదనే దాగింది
నీ పిలుపు అడుగులో నీడగా నిలిచింది
జాబిలే కొంటెగా కనుమలిపి పిలిచెనని
ఒంటరై మానసమె తెరువుకై వెదికింది
నవ్వులే తారలై వెలిగాయి నింగిలో
వెదుకుతూ పున్నమే బతుకులో ఒదిగింది

27.10.17

77.

 తనువంతా వేణువుగా మారుతోంది వెన్నెలలో
దాగివున్న కోరికేదొ వెలుగుతోంది వెన్నెలలో

ఒక్కరేయి గుండెలోన నిండాలని వచ్చెనులే
ఆగలేని హృదయమేదొ ఆడుతోంది వెన్నెలలో

మనసులోన వెల్లువగా ఒకరాగం ఉరికెనులే
నిండివున్న మౌనమేదొ చెదురుతోంది వెన్నెలలో

జ్ఞాపకాల శిధిలాలే బంధాలకు మిగిలెనులే
బాధించే గాయమేదొ మానుతోంది వెన్నెలలో

ఒక్కపిలుపు సమీరమై ఎదలోతున తాకెనులే
భారమైన అశ్రువేదొ కరుగుతొంది వెన్నెలలో

విమలమైన ఆశవకటి బతుకులోన విరిసెనులే
పాదుకొన్న చీకటేదొ తొలగుతోంది వెన్నెలలో


12.11.2017

78.

 మధువులెన్నొ చేరినవీ దాచలేను నా సఖియా
ఒంటరిగా కావ్యాలను రాయలేను నాసఖియా
హృదయంలో గాయాలకు పథ్యమింకా ముగియలేదు
మరణానికి చితికోసం వెదకలేను నా సఖియా
గుండెలోన సాగరమే చోటడిగి చేరవచ్చె
తడిచేరని రాయిలాగ మారలేను నా సఖియా
రేయంతా వెలుగుతాయి ఎదురుచూపు దీపాలే
కంటినీరు తైలాలను నిలుపలేను నా సఖియా
తరగకుండ రాతిరంత వెలుగుతుంది ఈ వెన్నెల
స్వప్నాన నీ తగవులు తీర్చలేను నా సఖియా

22.12.2017

79.

 మధువులు పంచే తలపులు ఎన్నో
దూరము గానే పులకలు ఎన్నో

రెప్పల మాటున గమనము మరిచెను
మౌనము నిండిన ఘడియలు ఎన్నో

మదిలో కొలువై ప్రియమగు రూపము
కన్నులు చేసే కొలుపులు ఎన్నో

దరికే చేరని జాబిలి తానే
సరసపు కిరణము లేఖలు ఎన్నో

గాలుల గంధము తనువును తాకెను
చూపుల చిక్కిన సిగ్గులు ఎన్నో

బిడియము నీడన తొందర తపనలు
గమ్యము చేరిన అడుగులు ఎన్నో

18.01.2018

80.

జారిపోయె కాలానికి తొందరెవరు ఆపగలరు
జ్ఞాపకాల గులాబీలు పూయుటెవరు ఆపగలరు
దూరమైన ఫలముపైన మమకారం తీరబోదు
కన్నులలో చేరకుండ కడలినెవరు ఆపగలరు
చెలికానివి ఊహలేవొ తుమ్మెదలై తాకెనేమొ
చెక్కిలిలో చేరకుండ కెంపులెవరు ఆపగలరు
కారుమబ్బు చాటునుండి కాంతిధార లెగసినవే
అలకతీరి పెరుగుతున్న చంద్రునెవరు ఆపగలరు
కరువుతీర విమలవాణి జాజరలే జల్లుతుంటె
జలకమాడి తడిసిపోవు మనసునెవరు ఆపగలరు

20.02.2018

81.

 మదిలో స్వప్నము తెలుపును సుఖములు
ఒలికే సిగ్గుల దాగును సుఖములు
కన్నులు కలువల జతనే కూడెను
చూపుల మధువును ఒలకును సుఖములు
వలపుల రగడను ఓపదు తనువే
తలపుల బిగిలో నిలుపును సుఖములు
క్షణముల దాహము తీర్చదు కాలము
అనువగు తరుణము చేరును సుఖములు
ఒంటరి మనసే రసమయ లోకము
చేరగ పిలుపులు కోరును సుఖములు

06.03.2018

82.

చేలమొకటి ఉరితాడై తగిలిపోయె చల్లగా
గూటిలోన నిదుర ఒకటి ముగిసిపోయె చల్లగా
దాచలేను మనసులోన నీవులేని అలికిడినీ
గుండెలోన చినుకు ఒకటి తాకిపోయె చల్లగా
చిన్ననవ్వు కత్తిలాగ పదునుచూపె ఎందుకో
బతుకులోన విసుగు ఒకటి తొలగిపోయె చల్లగా
మదిసవ్వడి ఒకపేరే పలుకుతోంది పదెపదే
నిదురలేని గాయమొకటి రేగిపోయె చల్లగా
ఏరుకున్న మధువులలో దాచలేదు కొన్నైనా
బాటలోన రాయి ఒకటి తాకిపోయె చల్లగా

12.03.2018

83.
రాలిపోయిన మొగ్గకోసం కంటనీరే తొణకుతున్నది
జాడదొరకని మనిషి కోసం ఆశ ఎంతో వెదుకుతున్నది
గుండెలోతున మౌనవేదన గొంతుకేదో మోగుతున్నది
జరిగిపోయిన దారుణమొకటి గుండెగుండెను కలుపుతున్నది
వెలుగునీడల ఆటనెప్పుడు నీడఒకటే గెలిచిపోవును
ధీరతన్నది నేర్పిపోగా బాధ్యతెంతో పెరుగుతున్నది
దారిచూపే దివ్వెకోసం కిరణమెప్పుడు వెదకదెప్పుడు
సాగిపోయే దారినిండా ఆశలెన్నో నింపుతున్నది
పిడికిలొదిగిన బలముచూస్తూ తప్పులన్నీ బెదురుతున్నవి
కాంతిమింగిన చీకటెందుకొ ఒంటరవుతూ వణుకుతున్నది

19.04.2018

84.
వెన్నెలగా తాకినదీ నీవలపని అనుకున్నా
రేయంతా వేణుగాన బృందావని అనుకున్నా
చిరుజల్లుల పులకింతల కోరికేదొ పిలిచినదీ
ఉరకలెత్తె రసవాహిని మనకేనని అనుకున్నా
మానసమే మురిసినదీ నీకన్నుల పిలుపుకనీ
నీసరసని రేరాజుగ వెలగాలని అనుకున్నా
ఎటుచూసిన నీవేనని చిత్రమెందుకు కొలుపుకనీ
నీమేనున పరిమళాలు కొసరాలని అనుకున్నా
తెలియలేను మదివాకిట పిలుపెవరిది నిండినదీ
సంభ్రమాల తడబడినది నాఅడుగని అనుకున్నా
మేనివిరుపు హరివిల్లే నాకోసం దిగివచ్చెను
సిగ్గుతెరల అరుణాలే నీచెంపని అనుకున్నా

85.
గుండెలోన అమ్మ నవ్వు నిండిందని గమనించు
బతుకెంతో తేలికగా మారిందని గమనించు
సమస్యలే జడివానై ముంచుతాయి ఎపుడైన
తనచేయే నీగొడుగై నిలిచిందని గమనించు
బెదురెందుకు పరాజయం సుడిగాలై విసిరెస్తె
పెనుగోడై నీవెనుకే అమ్ముందని గమనించు
తుదివరకూ మమకారం నీతోడై ఉందంటె
తనమనసే కంట తడిని మరిచిందని గమనించు
అశాంతికే చోటుపెరిగి నిదురంతా సెలవంటె
కనుపాపై జోలపాట పాడిందని గమనించు

27.04.2018
86.
 మదిలో వెన్నెల తోచెను ఇపుడే
తలపులు కడలై ఎగసెను ఇపుడే
సరియగు జోడని తారలె మురిసెను
జాబిలి బింకము చెదరెను ఇపుడే
పగలూ రేయీ గమనము మరిచెను
రెప్పల వాలున దాగెను ఇపుడే
ఆశకు రెక్కలు పూనీ ఎగిరెను
వలపుల పవనము వీచెను ఇపుడే
మోహన రూపుకు ప్రాణము బందీ
ఎదసడి మువ్వగ మారెను ఇపుడే

05-05-2018

87.

 ప్రతిమకు హారం చేరే సమయం ఇంకా ఉన్నది
దీపం కొండకు మరలే సమయం ఇంకా ఉన్నది

గరికై పోతే పాదము కిందన చోటే పదిలం
నియమిత బానిస మారే సమయం ఇంకా ఉన్నది

కడలే తానే నుదుటన బొట్టుగ మారుట చిత్రమె
చెమటగ నేలను తాకే సమయం ఇంకా ఉన్నది

కాంతికి వెనుకే నీడా కాదా.. ఒకటిగ వరమే
నేనిక నేనుగ తరలే సమయం ఇంకా ఉన్నది

సన్నగ మంటల మాటల తూటా దూసిన మరణమె
చల్లగ ఊపిరి వదిలే సమయం ఇంకా ఉన్నది

06.05.2018

88.

గుండెనిండా పండుతోందీ నీవువంపిన వెన్నెలా
కొంటెనవ్వులు రువ్వుతోందీ నీవుదాగిన వెన్నెలా

నీవురావని చెప్పుక్షణముల జతగవచ్చెను తిమిరమే
కంటికొలనులొ జలకమాడెను నీవుపంపిన వెన్నెలా

వలపులొలికే జాబిలేదని అలుగుతుందీ ఈరేయి
మనసుమూలలు తడుపుతుంది నీవునిండిన వెన్నెలా

ఎడదలోతుల మెరుపుతారను మింగుతుందీ విరహమే
నాదుపదముల వాలుతోందీ నీవుకురిసిన వెన్నెలా

పెదవిమాటున గుట్టులేవో విప్పుతుందీ మౌనమే
అలకనీడను తరుముతుందీ నీవునవ్విన వెన్నెలా

13.06.2018

89.
దాచుకున్న జ్ఞాపకాలు పుట ఏదో కదిలింది
లోనణిగిన బతుకువెలుగు కథ ఏదో కదిలింది

కోయిలగా మౌనమంత గొంతులోన ఒదిగింది
వసంతాల సమీరాన తెర ఏదో కదిలింది

కంటకాల బాటలోన తడబాటులు ఒంటరిగ
పయనానికి నీకోసం కల ఏదో కదిలింది

ఆకాశం దిగిరాగా స్నేహానికి హద్దేది
కంటిలోన చీకటిలో వెత ఏదో కదిలింది

తీయనైన గురుతులవే బరువంతా మోసాయి
విమలమైన తీరానికి అల ఏదో కదిలింది

16.06.2018

90.

మౌనమా మనసునే కోయకే నువ్వలా
హృదయమా చోటునే మరువకే నువ్వలా

సరిలేని సరసాల కరగనీ రేయినీ
విరహాల చెలిమినీ కోరకే నువ్వలా

వెన్నెలా స్నేహమూ నిలువనీ ఎప్పుడూ
తిమిరాల పంతాన చెదరకే నువ్వలా

గగనాల దుఃఖమే కురిసింది మేఘమై
సడిలేని సంద్రమై రగలకే నువ్వలా

విమలమై వెలగనీ ప్రణయాన దీపమూ
కన్నీటి రాగమై చెదరకే నువ్వలా

23.06.2018

91.
కాలమంత వేగంగా జారుకుంది ఎందుకలా
జ్ఞాపకాల గులాబులై తాకుతుంది ఎందుకలా

దూరమైన బంధానికి గురుతేదీ మిగలలేదు
గాయములో పదునేదో తాకుతుంది ఎందుకలా

అలకలేవొ ఎరగదెపుడు బేలమనసు బిడియమొకటె
తలపుతోనె కెంపులన్ని అద్దుకుంది ఎందుకలా

కారుమబ్బు వేదనగా ముసుగువేసె కలలపైన
చిన్నిఆశ మెరుపుతీగ వెదుకుతుంది ఎందుకలా

బంధనాల విమలవాణి రాగాలను మరువలేదు
మౌనాలకు చోటేదని అడుగుతుంది ఎందుకలా

22.07.2018

92.
బాల్యమంత అరచేతిన దాచాలని ఉన్నదీ
జ్ఞాపకాల మిణుగురుతో ఆడాలని ఉన్నదీ

తీయనైన తేనెలోన కష్టమెంత దాగుంది
అడుగుకొక్క పాఠాన్నే నేర్వాలని ఉన్నదీ

గులాబీకి ఎడబాయని రక్షణగా ముల్లుంది
ధైర్యాన్నే నేస్తంగా పొందాలని ఉన్నదీ

చీకటిలో చిరుదీపమె వెలుగులెన్నొ ఇస్తుంది
చిరుగాలికె మలుగుటేల అడగాలని ఉన్నదీ

ఏమెరుగని పాపలంటు మురిపమొకటె సరియౌన
కంటిరెప్ప నీడలోన నిలపాలని ఉన్నదీ

28.07.2018

93.

దారిపక్క పూరేకులు ఏరుకునే వారెవ్వరు
చితుకుతున్న హృది ఘోషను తెలుసుకునే వారెవ్వరు

విషాదాల బరువెంతో అశ్రువేదీ తూచలేదు
పర్వాలను మధుపాత్రగ దాచుకునే వారెవ్వరు

మనసుపాడు పాటలెంత మధురమైన ఏమున్నది
గళముపంచి యుగళాలను అందుకునే వారెవ్వరు

పూలరజను దారులలో గంధమెంత దాగున్నది
కన్నులలో గాయాలను చదువుకునే వారెవ్వరు

స్వప్నాల పయనంలో పాదమెంత అలిసిందో
గులాబీల హృదయంలో నిలుపుకునే వారెవ్వరు

30.08.2018

94.












No comments:

Post a Comment